
Aug 11 2026 12:28 PM | Updated on Aug 11 2026 12:28 PM
వాగులోంచి ఉపాధ్యాయురాలిని బయటకు తీసుకొస్తున్న కర్లపొదర్ గ్రామస్తులు
అల్లూరి సీతారామరాజు జిల్లా : పాఠశాలకు వెళ్లేందుకు వాగు దాటే క్రమంలో ఓ ఉపాధ్యాయురాలు ప్రవాహంలో కొట్టుకుపోయారు. కర్లపొదర్ గ్రామస్తులు కాపాడడంతో ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ కర్లపొదర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎం.మణి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లే క్రమంలో కర్లపొదర్ వద్ద ఉన్న వాగును దాటుతున్న సమయంలో లోతును అంచనా వేయలేక, నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొంతదూరం కొట్టుకుపోయా రు.
అదృష్టవశాత్తూ చేతికి చెట్టుకొమ్మ తగలడంతో దానిని పట్టుకుని గట్టిగా కేకలు వేయడంతో గమనించిన కర్లపొదర్ గ్రామస్తులు పరుగుపరు గున సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను కాపాడి, వాగు నుంచి బయటకు తీసుకువచ్చారు.ఈ విష యం తెలుసుకున్న ఎంఈవో–2 త్రినాథరావు, సీఆర్పీ ఈశ్వర్ కర్లపోదర్ గ్రామానికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశా రు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా లబ్బూరు ఆస్పత్రికి తరలించారు.వైద్యులు పరీక్షలు నిర్వహించి,ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. కర్లపోదర్ వాగుపై చేపట్టిన వంతెన నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్మీపురం మాజీ సర్పంచ్ కొర్రా త్రినాథ్, కర్లపోదర్ గ్రామస్తులు కోరారు.
కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)
కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు)
‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)
‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు)
ప్రశ్నిస్తే చాలు దాడులు చేస్తున్నారు.. కూటమి నేతలకు బొత్స వార్నింగ్
నిన్ను సొంత అన్న అనుకున్న.. మా చావుకు కారణం నువ్వే చింతమనేనిపై రెచ్చిపోయిన బాధితులు
DSP సాబ్ దెబ్బ ఓడిపోయే మ్యాచ్‌ని గెలిపించిన సిరాజ్
అట్టుడుకుతున్న జార్ఖండ్ వెనక్కి తగ్గేదే లే!