
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టీడీపీ అధినాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తూ వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.