
Home » Andhra Pradesh » TDP Leader chinna Srinu daughter shirisahasra meets goa governor ashok gajapathi raju smr
విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేత చిన్న శ్రీను, ఆయన కుమార్తె శిరిసహస్ర గోవాలో ఆ రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు.
విజయనగరం, సెప్టెంబర్13: జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేత చిన్న శ్రీను, ఆయన కుమార్తె శిరిసహస్ర గోవాలో ఆ రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గోవాలోని గవర్నర్ బంగ్లాలో చిన్న శ్రీను కుటుంబానికి అశోక్ గజపతిరాజు, టీడీపీ ఎమ్మెల్యే అదితివిజయలక్ష్మి ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు.
ఈ భేటీ అనంతరం చిన్న శ్రీను మాట్లాడుతూ.. పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆదేశాలతో పాటు అశోక్ గజపతిరాజు సూచనలను తూచా తప్పకుండా పాటిస్తానని తెలిపారు. అశోక్ గజపతి రాజు ఆశీస్సులు, మార్గదర్శకత్వం కోసమే ఈ సమావేశం జరిగిందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీను ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో అతడు టీడీపీ కండువా కప్పుకున్నాడు.
నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు జగన్: హోంమంత్రి అనిత..
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్






