
రోజూ వంటల్లో, సలాడ్లలో లేదా నిమ్మరసం కోసం సగం చెక్కను వాడి, మిగిలిన సగాన్ని ఫ్రిజ్లో దాచిపెట్టడం ప్రతి ఇంటా సర్వసాధారణం. అయితే మరుసటి రోజు తీసి చూస్తే ఆ నిమ్మచెక్క ఎండిపోయి, గట్టిపడిపోయి రసం సరిగ్గా రాదు. పైగా ఫ్రిజ్లో ఉండే ఇతర పదార్థాల వాసనలను పీల్చుకుని దాని సహజ సువాసన కూడా మారిపోతుంది. ఈ చిన్న సమస్యకు వంటిట్లోనే దొరికే సాధారణ వస్తువులతో సులభంగా పరిష్కారం కనుగొనవచ్చని గృహిణులు, నిపుణులు సూచిస్తున్నారు.




