
హైదరాబాద్, సెప్టెంబర్ 14: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక ప్రకటన చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) 2026 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రధాన విభాగాలు, అనుబంధ సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనున్నారు. SSC CGL 2026 ద్వారా మొత్తం 12,256 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ పోస్టులకు సంబంధించిన టైర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్షను (Tier-I CBE) సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు నిర్వహించనున్నారు.





