
పలాస : శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ పురపాలక సంఘంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ఓటర్ జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. కార్యాలయంలో కమిషనర్ ఈ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జాబితాలను నోటీసు బోర్డులో పెట్టారు పలాస ఎంఆర్ఓ, ఆర్టీవో కార్యాలయంలో జాబితాలు అందుబాటులో ఉంచారు. జాబితాలో కులాలపై అభ్యంతరాలు ఉంటే కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. మేనేజర్ నరసింహ మూర్తి, పట్టణ ప్రణాళిక ఇన్‌ఛార్జ్ హర్ష కుమార్ సిబ్బంది ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



