
కవిటి: వినాయకచవితి వేడుకలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. విభిన్న రూపాల్లో గణనాథుల విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంక పెద్ద ఒరియా వీధిలో శ్రీ లక్ష్మీగణపతి యూత్‌ ఆధ్వర్యంలో వ్యవసాయం నేపథ్యంలో తీర్చిదిద్దిన గణేశుడు ఆకట్టుకుంటున్నాడు. రైతు వేషధారణలో గణపయ్యతో పాటు రెండు ఎద్దులు, సంప్రదాయ నాగలి, పచ్చని పంట పొలాలు, వ్యవసాయ పనులను ప్రతిబింబించే దృశ్యాలతో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. భారతీయ వ్యవసాయ జీవన విధానానికి ప్రతీకగా తీర్చిదిద్దారు. అన్నం పెట్టే రైతన్నకు కృతజ్ఞత తెలపడమే తమ ఉద్దేశమని శ్రీలక్ష్మీగణపతి యూత్‌ కమిటీ సభ్యులు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




