
ఉదయం ఓట్స్‌లో స్ట్రాబెర్రీ ముక్కలను మిక్స్ చేసి తీసుకుంటే బాగుంటుంది. పోషకాలు కూడా అందుతాయి. అరటి పండ్లు, స్ట్రాబెర్రీలను పాలతో కలిపి స్మూతీ చేసి తాగితే శక్తి బాగా వస్తుంది. హెల్తీగా కూడా ఉంటుంది. స్ట్రాబెర్రీలో బాదం పాలు వేసి, కొంచెం తేనె కూడా వేసి బ్లెండ్ చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి చాాలా మంచిది. స్ట్రాబెర్రీలతో జామ్ చేసుకుంటే బాగుంటుంది. బ్రెడ్, చపాతీ, దోశతో తింటే రుచిగా ఉంటుంది. పాలకూర, కీరదోస ఇలా మీకు నచ్చిన వాటిలో స్ట్రాబెర్రీ ముక్కలు కూడా వేసుకుని సలాడ్‌గా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం యోగర్ట్‌లో తేనె కలిపి స్ట్రాబెర్రీలతో తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. కేక్ లేదా పాన్కేక్స్పై స్ట్రాబెర్రీలను పైన వేసుకుని తింటే బాగుంటుంది. ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. స్ట్రాబెర్రీలను చాక్లెట్ డిప్‌తో తింటే బాగుంటుంది. డార్క్ చాక్లెట్ కరిగించి, ముంచి తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్ట్రాబెర్రీలను ఎండబెట్టి మధ్యాహ్నం స్నాక్స్ టైంలో తింటే బాగుంటుంది. కొన్ని రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి.