
ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. 46 ఏళ్ల వయసులోనూ జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా తన వర్కౌట్స్‌కు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకోగా.. అది వైరలవుతోంది. ఇందులో ఆమె సైక్లింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్, బ్యాటిల్ రోప్స్‌తో పాటు పలు రకాల కఠినమైన వ్యాయామాలు చేశారు (Nargis Fakhri Fitness). కేవలం వ్యాయామాలే కాదు.. ఆహారం విషయంలోనూ నర్గీస్ ఎంతో శ్రద్ధ తీసుకుంటారట. తాజాగా తాను రోజూ తాగే ‘గ్రీన్ జ్యూస్’ రెసిపీని అభిమానులతో పంచుకున్నారు. సెలెరీ, పాలకూర, నిమ్మకాయ, అల్లంతో దాన్ని తయారు చేసినట్లు తెలిపారు. ఈ పోషకాలతో కూడిన జ్యూస్ తనకు రోజంతా ఉల్లాసాన్నిస్తుందని పేర్కొన్నారు. గతంలో నటి సోహా అలీఖాన్‌తో జరిగిన ఓ చిట్‌చాట్‌లో తన చర్మ సౌందర్య రహస్యాలను నర్గీస్ పంచుకున్నారు. అందమైన, ఆరోగ్యకరమైన చర్మానికి ఎలాంటి ‘షార్ట్‌కట్స్’ ఉండవని స్పష్టం చేశారు. తగినంత నిద్ర, రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండడం, పోషకాహారం తీసుకోవడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితోనే అది సాధ్యమవుతుందని వెల్లడించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ‘మహాశక్తి’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’ (Ramayana).



