
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేసిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరదరాజ్‌పూర్‌కు చెందిన మాజీ సర్పంచ్‌తో పాటు ఆరుగురు బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్‌ చేశారు. విజయవాడలోని ఓ లాడ్జిలో ఉండగా వారిని పట్టుకున్నట్లు సమాచారం. ఆరుగురి ఫోన్లు స్విచాఫ్‌లో ఉండగా.. మరొకరు ఆన్‌ చేయడంతో పోలీసులు లొకేషన్‌ ట్రాక్‌ చేసి పట్టుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి గజ్వేల్‌కు తరలించారు. నిందితులను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం వారిని సిద్దిపేట జైలుకు తరలించారు. దళితులను అవమానించారని కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఫాంహౌస్‌ పరిసరాల్లో ఇప్పటికే ఫొరెన్సిక్‌ ఆధారాలను పోలీసులు సేకరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌ గణేశుడు తర్వాత అంతటి ప్రసిద్ధి బాలాపూర్‌ గణపయ్య (Balapur Ganesh)కే దక్కుతుంది. ఈ ఏడాది ఇక్కడ పూరీ (Puri) జగన్నాథుడి ఆలయం నమూనాలో 18 అడుగుల వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు తలపెట్టిన ‘హెచ్‌ సిటీ’ ప్రాజెక్ట్‌ పనులపై జీహెచ్‌ఎంసీ పునరాలోచిస్తోందని సమాచారం.