
దిల్లీ: భారత్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా దిల్లీ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ (IND vs AFG) ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత్‌ బౌలర్ల దాటికి ప్రత్యర్థి బ్యాటర్లు విలవిల్లాడారు. ఓపెనర్‌ ఇబ్రహీం బద్రాన్‌ (37) టాప్‌ స్కోరర్‌. రసూలి (26), రషీద్‌ ఖాన్‌ (28), నబీ (20) ఫర్వాలేదనిపించారు. భారత్‌ బౌలర్లలో నితీశ్‌కుమార్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ 2, బుమ్రా, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.