
సౌదీ అరేబియాలోని కీలక ఆయిల్ పైప్‌లైన్ మూసివేత భారత చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. హూతీ రెబెల్స్ వైమానిక దాడుల కారణంగా పైప్‌లైన్ మూ సౌదీ అరేబియాలోని కీలక ఆయిల్ పైప్‌లైన్ మూసివేత భారత చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. హూతీ రెబెల్స్ వైమానిక దాడుల కారణంగా పైప్‌లైన్ మూసివేయడంతో, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్‌కు ప్రత్యామ్నాయ సరఫరాల ఖర్చు పెరిగి ధరల మోత తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు సుమారు 5 మిలియన్ బ్యారెళ్లభారత్కు సౌదీ అరేబియా నుంచి ముడిచమురు దిగుమతులు తక్కువే అయినా దీర్ఘకాలంపాటు అంతరాయం కొనసాగితే దేశీయంగా ఇంధన ధరలపై ప్రభావం పడనుంది. హూతీ రెబెల్స్ ఈనెల 10న జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో సౌదీ ముందుజాగ్రత్త చర్యగా తన 1,200 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్‌ను మూసివేసింది. ఈ పైప్‌లైన్ ద్వారా సౌదీ ఎర్ర సముద్ర తీరానికి రోజుకు సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ఇది ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 4-5శాతంగా ఉంది. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా ముడిచమురు కొరత ఏర్పడే ప్రమాదం నెలకొంది. సౌదీ పైప్‌లైన్ మూసివేతతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 107 డాలర్లు దాటగా, యూఏఈకి చెందిన మర్బన్ క్రూడ్ 119 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. పశ్చిమ తీరానికి రష్యా నుంచి వచ్చే చమురు సైతం బ్యారెల్‌కు 2.50 డాలర్ల ప్రీమియంలో ఉంది. ఈ అంతరాయం దీర్ఘకాలం కొనసాగితే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఇంధన రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చి- ఏప్రిల్ నెలల్లో రోజుకు 6లక్షల బ్యారెళ్లుభారత్కు సౌదీ నుంచి నేరుగా వచ్చే చమురు తక్కువే అయినప్పటికీ అసలు ముప్పు వేరేలా ఉంది. దేశీయంగా మొత్తం ముడిచమురు దిగుమతులు రోజుకు సుమారు 4.7 మిలియన్ బ్యారెల్స్ కాగా ఆగస్టులో సౌదీ నుంచి సరఫరా రోజుకు 3,15,000బ్యారెళ్లుగా ఉంది. సంక్షోభం గరిష్ట స్థాయిలో ఉన్న మార్చి- ఏప్రిల్ నెలల్లో దిగుమతులు రోజుకు సుమారు 6,00,000 బ్యారెళ్లుగా ఉండేవి. అయితే సౌదీ పైపులైన్ మూసివేత నేపథ్యంలో ప్రత్యామ్నాయ చమురు కోసం ఆసియా రిఫైనరీల మధ్య పోటీ పెరిగి, అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు, క్రూడాయిల్ గ్రేడ్ వ్యత్యాసాల భారం దేశీయ చమురు సంస్థలపై పడుతుంది. సౌదీ నుంచి ఎల్పీజీ దిగుమతులు కూడా జులై నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. సౌదీలోని ఎర్రసముద్ర తీరంలో ఉన్న రిఫైనరీలు, విద్యుత్ ప్లాంట్లపై ఈ పైప్‌లైన్ మూసివేత ప్రభావం పడనుంది. అక్కడ ఉన్న చమురునిల్వలు కేవలం 7 నుంచి 10 రోజులు మాత్రమే సరిపోతాయని అంచనా. ఇరాన్ మద్దతు ఉన్న హూతీ రెబల్స్ దాడుల భయంతో హర్మూజ్ జలసంధి ద్వారా చమురు మళ్లింపు కూడా అంత సులభం కాదు. యెమెన్‌లో 500 మందికి పైగా మృతిఇదిలా ఉండగా, 2022 నుంచి చాలావరకు శాంతి నెలకొల్పిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత యెమెన్‌లో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. దేశం తిరిగి పూర్తిస్థాయి అంతర్యుద్ధం దిశగా వెళ్తోంది. ఎర్ర సముద్రం వెంబడి హూతీల దాడులు కొనసాగుతుండగా, దేశంలోని అంతర్గత ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా చాలాకాలంగా యుద్ధభూమిగా ఉన్న తైజ్ ప్రావిన్స్‌లోనూ పోరాటం తీవ్రంగా సాగుతోంది. గత వారం రోజుల్లో యెమెన్‌లో 500 మందికి పైగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతకుముందు వారంలో ఈ సంఖ్య దాదాపు 200గా ఉంది. హూతీ తిరుగుబాటుదారులు వేగంగా ముందుకు సాగుతూ, గతంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ దళాల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ పోరాటం కారణంగా దాదాపు 94 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.