
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ సాహిత్య సంస్థ సాహిత్య అకాడమీ మంచి అవకాశం కల్పిస్తోంది. న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సాహిత్య అకాడమీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన మొత్తం 30 పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 21, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు..