
ఇంటర్నెట్ డెస్క్: రష్యా - ఉక్రెయిన్ (Russia-Ukraine war) దేశాల మధ్య ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం రాత్రి కూడా ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఘటనలో ఉక్రెయిన్ టెన్నిస్ ప్లేయర్ డయానా యస్ట్రెమ్స్కాకు చెందిన అపార్ట్‌మెంట్ ధ్వంసమైంది. అయితే, ఇందులో తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అందులో తన అపార్ట్‌మెంట్ కాలిపోతున్న వీడియో, ఫొటోలను పోస్టు చేసింది. కేవలం ఫ్రెంచ్ ఓపెన్ సమయంలో తాను వినియోగించిన టవల్‌ మాత్రమే మిగిలి ఉందని పేర్కొంది. ‘‘ఈ రాత్రి ‘రష్యన్ ప్రపంచం’ అంటే ఇదేనని అర్థమైంది. క్షిపణితో నేరుగా దాడి చేసింది. మా అపార్ట్‌మెంట్‌ను ధ్వంసం చేసింది. నాకు మిగిలింది ఒక రోలాండ్‌ గారోస్‌ టవల్ మాత్రమే. రష్యా మిస్సైల్‌ దెబ్బకు నా ఇల్లు తట్టుకోలేకపోయింది. కానీ, వరల్డ్ టెన్నిస్‌ భాగం మాత్రం మిగిలింది. ఈ చిత్రాలను మా కళ్లతో చూడండి. ఉక్రెయిన్ కోణం నుంచి చూస్తే, మీ ‘తటస్థత’కు అసలైన అర్థం ఇదే’’ అని పోస్టు చేసింది. ఇప్పుడే కాదు.. 2024 డిసెంబర్‌లోనూ డయానా బాధితురాలే. తన బామ్మ కాలం నాటి ఇల్లు కూడా ఇలానే ధ్వంసమైనట్లు అప్పట్లో వెల్లడించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





