
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ప్రాంతంలో 388 ఎకరాల ప్రభుత్వ భూమి దీనిపై నెల రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశిస్తున్నా ధరణి అక్రమాలపై ప్రత్యేక బృందంతో విచారణ రెవెన్యూ, ధరణిపై ఇది పార్ట్‌-1 మాత్రమే... త్వరలోనే టీజీఐఐసీ, సంగారెడ్డి భూములపై పార్ట్‌-2 నా కళ్లలోకి చూసే ధైర్యం లేకే.. భారాస నేతలు పారిపోయారు 22-ఏపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిషేధిత జాబితాలోని 1.02 కోట్ల ఎకరాల్లో ప్రైవేటుకు చెందిన 3.73 లక్షల ఎకరాలు మినహా.. మిగతా 98.31 లక్షల ఎకరాలకు పైగా ఎప్పటికీ నిషేధిత జాబితాలో ఉండాల్సినవే. ఈ జాబితా నుంచి తప్పిస్తే ఇక ఆ భూములు కూడా మిగలవు. అధికారికంగానైనా ఇంచు భూమి కూడా తీయగలిగే శక్తి ప్రభుత్వానికి లేదు. నిషేధిత జాబితాలో పెట్టకుంటే ప్రజలకు అన్యాయం చేసినట్లే. అటవీ, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి అవకాశమిచ్చినట్లే. కోటి ఎకరాలు కొల్లగొట్టారంటూ ప్రచారం చేశారు. ఏమైనా అర్థం ఉందా? మూక అసెంబ్లీ పెట్టుకున్నారు. ఆ మూకలు ఏ కోటి ఎకరాలో చెప్పవచ్చు కదా. పైపెచ్చు ఆ మూక అసెంబ్లీకి కేసీఆర్‌ రాలేదు. ఎందుకంటే అక్కడ స్పీకర్‌ స్థానంలో దళిత బిడ్డ ఉండడమే కారణం. హరీశ్‌రావు ఊరూరా తిరిగి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారా? అలాగైతే ప్రభుత్వానికి కేసీఆర్, భారాస ఒక లేఖ రాయాలి. ప్రభుత్వ భూములను కాపాడేందుకు మేం నిరంతరం పహారా కాస్తూ, కొట్లాడుతుంటే.. భారాస నాయకులు కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనాడు, హైదరాబాద్‌: ధరణి పేరిట గత ప్రభుత్వంలోని ముఖ్యనేతలు రూ.లక్ష కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ ముసుగులో కేసీఆర్, ఆయన కుటుంబంతో పాటు ఇతర భారాస నేతలూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్‌ 700 ఎకరాల ఫామ్‌హౌస్‌ ప్రాంతంలో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందా? లేదా? సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్‌ నోటీసులు జారీ చేసి, కొనుగోలు చేసిన భూమి, స్వాధీనంలోని భూమి వివరాలు నెల రోజుల్లో నిగ్గు తేల్చాలని ఆదేశించారు. 30 రోజుల్లో తేల్చకుంటే.. అధికారులు, సంబంధిత మంత్రులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ధరణి అక్రమాలపై విచారణ బాధ్యతను ప్రత్యేక విచారణ బృందాని (ఎస్‌ఈటీ)కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. 22-ఏ బాధితుల సమస్యలపై అధికారుల కమిటీ వేసి, 30 రోజుల్లో న్యాయం చేస్తామని, పేదలకు ఒక్క గుంట, పైసా నష్టం జరగకుండా పారదర్శక పరిపాలన అందిస్తామని చెప్పారు. 12 రకాల భూసంబంధిత సమస్యలకు శాసనసభ వేదికగా పరిష్కార, కార్యాచరణ మార్గాలను వెల్లడించారు. బుధవారమిక్కడ శాసనసభలో 22-ఏపై చర్చ సందర్భంగా సీఎం మూడు గంటలసేపు మాట్లాడారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌లో భూములతో పాటు, ఆయన కుటుంబానికి చెందిన మరో 400 ఎకరాలకు సంబంధించి అక్రమాలున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని.. ఏ దళిత బిడ్డలు నడిచిన నేలపై పసుపు నీళ్లు చల్లి అవమానించారో.. ఆ దళిత బిడ్డలకు అక్కడే అరెకరం చొప్పున పట్టాలిస్తామని ప్రకటించారు. ‘‘అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌కు విరుద్ధంగా కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి ఇన్ని భూములు ఎలా వచ్చాయి? వేల కోట్ల రూపాయలకు ఆధారాలున్నాయా? వెంటనే వెల్లడించాలి. మాపై మీరు చేసే ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలి. అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తాననే.. నా కళ్లలోకి చూసేందుకు, మాట్లాడేందుకు ధైర్యం లేక భారాస నాయకులు అసెంబ్లీ నుంచి పారిపోయారు. చేసిన దొంగతనాలకు ముక్కు నేలకు రాసి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిజాం సర్కారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన భూములను ఒకే కుటుంబం దోపిడీ చేసింది. వాటిని బయట పెడతాం. ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తామనే.. మాజీ సీఎం కేసీఆర్‌ శాసనసభకు రాకుండా పరారయ్యారు. పహాణీ రికార్డులో కాస్తు కాలమ్‌ తీసేసి, దళితులు, ఎస్టీలు, బీసీలకు భూములపై రావాల్సిన హక్కులు తొలగించి పేదలకు అన్యాయం చేశారు. దీని వెనుక కుట్ర ఉంది’’ అని సీఎం విమర్శించారు. 2018 వరకు నాలుగున్నరేళ్ల తెరాస పరిపాలనలో.. టెండర్లు, కాంట్రాక్టులు, కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పేరిట రూ.1.83 లక్షల కోట్ల బిల్లులు చెల్లించారు. తర్వాత భూముల్ని ఎలా కొల్లగొట్టాలా అని కేసీఆర్‌ మెదడులో పుట్టిన పురుగు భూతమై తెలంగాణను పట్టి పీడిస్తోంది. ధరణి, భూరికార్డుల ప్రక్షాళన విధానాన్ని తానే కనిపెట్టినట్టు ఆయన చెప్పిన మాటలు అబద్ధం. 2010లో ఒడిశాలో అప్పటి ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. అక్కడ ఈ ప్రాజెక్టును ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఇవ్వగా, అదంతా లోపభూయిష్టమని, వెంటనే నిలిపివేయాలని 2014లో కాగ్‌ చెప్పింది. 2018లో కేసీఆర్‌ ధరణి కాంట్రాక్టును ఈ-సెంట్రిక్, విజన్‌ ఇన్ఫోటెక్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు అప్పగించి, భూరికార్డులను కట్టగట్టి కలెక్టర్ల రూముల్లో సీల్‌ చేశారు. అనంతరం ధరణిలో దందాలకు తెరలేపారు. టెండరు వచ్చిన తరువాత టెరాసిస్‌ అనే కంపెనీకి ఇచ్చారు. ఇలా ఆ ప్రాజెక్టు కాంట్రాక్టు తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్, సింగపూర్, బ్రిటిష్‌ ఐలాండ్, కేమేన్‌ ఐలాండ్స్‌లోని సంస్థలకు వెళ్లింది. బ్రిటిష్, కేమేన్‌ ఐలాండ్స్‌.. మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాలు చేసేవారికి స్వర్గధామాలు. తెలంగాణ రైతులకు సంబంధించి 2.5 కోట్ల ఎకరాల భూమి, బ్యాంకు ఖాతాలు, పాస్‌బుక్‌లు, ఎకౌంట్స్‌ అక్కడి మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయాయి. కేసీఆర్‌ రావాలి.. ఇవన్నీ చర్చించాలని డిమాండ్‌ చేశాం. అందుకే గందరగోళం చేసి పారిపోయారు. ధరణి ప్రాజెక్టు ఎన్‌ఐసీకి కాకుండా ప్రైవేటుకు ఇచ్చారు. రూ.110 కోట్ల ప్రాజెక్టు ఇది. ఐదేళ్లు నిర్వహిస్తే కానీ డబ్బులు రావు. రూ.110 కోట్ల వ్యాపారం చేసే ఈ ప్రాజెక్టును రూ.1300-1400 కోట్ల పెట్టుబడులతో మరో సంస్థ ఎందుకు తీసుకుంది? ఇందులో మోసం కనిపిస్తోంది. విచారణ చేయాల్సిన అవసరముంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ను తీసుకువస్తే.. తెదేపా, కాంగ్రెస్‌లు దాన్ని కొనసాగించాయి. కేసీఆర్‌ 2016లో దీన్ని రద్దు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్‌ కేసులు పెట్టే ఆయుధాన్ని ఎవరైనా బావిలో పడేస్తారా? ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. భూభారతి పైలెట్‌ ప్రాజెక్టు మాన్యువల్‌ రికార్డుల్లో ఏమి ఉంటే.. అదే డిజిటలైజ్‌ చేయాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ ధరణిలో రికార్డులను సీజ్‌ చేసి, కావాల్సిన వారి పేరిట భూములు బదిలీ చేశారు. కచేరికి పిలిస్తే.. తప్పు చేసిన వారు రారు. ఆయనను శాసనసభకు పట్టుకురమ్మని స్పీకర్‌ ఏమైనా ఆదేశాలు ఇస్తే కానీ వచ్చేలా లేరు. ప్రభుత్వ, ఎసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, అటవీ, ఇతర ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు, వాటికి రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఉండేందుకు.. 1999లో ఉమ్మడి ఏపీ తొలిసారి 22-ఏను తీసుకువచ్చింది. స్పష్టత లేకపోవడంతో 2007లో చట్టం కొత్తరూపంలో వచ్చింది. 2011-15 వరకు 22-ఏపై కోర్టులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. 2015లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ నిషేధిత ఆస్తులను క్లాజ్‌లుగా వర్గీకరించి, ఆధారితాన్ని పేర్కొనాలని, తప్పుగా ఉంటే సరిచేయాలని తీర్పు ఇచ్చింది. ఈ మేరకు కేసీఆర్‌ ప్రభుత్వంలో జీవో నం.121, రిజిస్ట్రేషన్‌ నిబంధనలను సవరించారు. భూములను నిషేధిత జాబితా నుంచి ఏ స్థాయి అధికారి తొలగించాలో ఉత్తర్వులు ఇచ్చారు. అయినా ఆదేశాలు సరిగా అమలు కాలేదు. 2017 నుంచి కొత్తగా 28,612 కేసులు వచ్చాయి. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, 2025 అక్టోబరు నాటికి కటాఫ్‌ తేదీగా 22-ఏ జాబితాను వర్గీకరించి సబ్‌రిజిస్ట్రార్లకు పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాల వారీగా ప్రక్రియ చేపట్టి, డిసెంబరు నాటికి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాం. ఉదాహరణకు ఒక భూమిపై బాధితులు హైకోర్టులో గెలిచి లేఅవుట్‌ అనుమతి తీసుకువచ్చి ప్లాట్లుగా చేసి విక్రయించారు. కొన్నేళ్ల తరువాత సుప్రీంకోర్టు.. ఆ భూమికి ప్రభుత్వమే యజమాని అని ప్రకటించింది. ఒకవేళ నిషేధిత జాబితా నుంచి తీసివేస్తే అక్రమాలు జరిగాయంటారు. ముందు చూస్తే నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది. మమ్మల్ని బావిలో దూకమంటారా? మాజీ సైనికులు, సొసైటీల స్థలాలు, ప్రభుత్వం చేసిన భూకేటాయింపులు, విక్రయాల వివరాలను తొలగించకుండా 2025 నిషేధిత జాబితాలో కలెక్టర్లు అప్‌లోడ్‌ చేశారు. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మంత్రికి ఫిర్యాదు చేశారు. కొంత భూమి ప్రభుత్వ, కొంత ప్రైవేటు ఉండగా.. ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు వెల్లడి కావడంతో సంబంధిత అధికారిని సస్పెండ్‌ చేశారు. ఇంకో వెంచర్‌లో ప్రభుత్వ భూమిని ప్రైవేటు చేస్తే సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేశారు. జనవరిలో నలుగురు సబ్‌రిజిస్ట్రార్లపై వేటుపడటంతో వారంతా.. రెవెన్యూ మ్యాప్‌లో స్పష్టంగా తీసి ఇస్తేనే చేస్తామని చెప్పారు. ఉదాహరణకు ఒక సర్వే నంబరులోని 50 ఎకరాల్లో ప్రభుత్వ భూమి 10 ఎకరాలు, ప్రైవేటు 40 ఎకరాలు అయితే.. ఆ మ్యాప్‌లో పది ఎకరాలు ఎక్కడ ఉందో మార్కింగ్‌ చేయాలని సబ్‌రిజిస్ట్రార్లు స్పష్టం చేశారు. మార్కింగ్‌ చేస్తే తప్ప ముందుకు వెళ్లబోమన్నారు. దీంతో 3 లక్షల ప్రైవేటు