
ఢిల్లీ వేదికగా మంగళవారం భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 2వ టీ20 జరగనుంది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. వరుణ్ చక్రవర్తి గాయంతో తప్పుకోవడంతో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సిరీస్ నిలవాలంటే ఆఫ్ఘన్ బ్యాటర్లు తప్పక రాణించాల్సి ఉంది. అభిషేక్ శర్మ, బుమ్రా సూపర్ ఫామ్‌లోకి రావడంతో ఈ మ్యాచులోనూ భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.