
ఈ దసరాకి ‘రణబాలి’ చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌ దేవరకొండ - రష్మిక. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశకు చేరుకోగా.. ఇప్పుడిందులో రష్మిక పోషిస్తున్న జయమ్మ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇది 1854 - 1878 మధ్య కాలం నాటి బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా. రాయలసీమ నేపథ్యంగా సాగుతుంది. ప్రస్తుతం తుది దశలో ఉన్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 16న థియేటర్లలోకి రానుంది. దీనికి అజయ్‌ - అతుల్‌ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





