
కర్ణాటక బాగల్కోట్ ఎమ్మెల్యే ఉమేష్ మేటి మేనకోడలు డాక్టర్ అంకిత యార్గల్ ప్రభుత్వ నమ్మ క్లినిక్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ విధులకు హాజరుకాకుండానే నెలా నెలా రూ.70 వేలకు పైగా జీతం తీసుకుంది. ప్రస్తుతం ఈమె వ్యవహారం బయట పడడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తుతోంది. ఓవైపు ప్రైవేట్ కాలేజీలో పీజీ చేస్తూనే ఈ అక్రమానికి పాల్పడినట్లు తేలడంతో.. బాగల్కోట్ జిల్లా పంచాయతీ సీఈవో విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆమెను అధికారులు విధుల నుంచి తొలగించారు.
Found this helpful?
Share this story with your network