
కొన్నిసార్లు గాయాలు క్రీడాకారుల కెరీర్నే ప్రశ్నార్థకం చేస్తుంటాయి. కానీ వాటిని అధిగమించి ఫిట్నెస్ సాధించినప్పుడే తిరిగి క్రీడల్లో రాణించగలమంటోంది జూడో ప్లేయర్ రజ్విందర్ కౌర్. ఈ క్రీడలో దేశానికి పలు పతకాలు సాధించి పెట్టిన ఆమె.. ఒకానొక సమయంలో గాయాల పాలైంది. కొన్నిసార్లు గాయాలు క్రీడాకారుల కెరీర్‌నే ప్రశ్నార్థకం చేస్తుంటాయి. కానీ వాటిని అధిగమించి ఫిట్‌నెస్‌ సాధించినప్పుడే తిరిగి క్రీడల్లో రాణించగలమంటోంది జూడో ప్లేయర్‌ రజ్విందర్‌ కౌర్‌. ఈ క్రీడలో దేశానికి పలు పతకాలు సాధించి పెట్టిన ఆమె.. ఒకానొక సమయంలో గాయాల పాలైంది. వీటి కారణంగా తన క్రీడా కెరీర్‌ ముగిసిపోకూడదని భావించి.. తిరిగి ఫిట్‌నెస్‌ సాధించి.. పడి లేచిన కెరటంలా రింగ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం 40 ఏళ్లు దాటినా పతకాలు సాధించడమే కాదు.. తాజాగా ‘భారత మహిళల జూడో జట్టు’కు కోచ్‌గా నియమితురాలై వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో రజ్విందర్‌ గురించి తెలుసుకుందాం.. పంజాబ్‌ జలంధర్‌లో పుట్టి పెరిగింది రజ్విందర్‌. చిన్నతనం నుంచే ఆమెకు ఆటలంటే ఇష్టం. ఈ మక్కువతోనే స్ప్రింటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. కాలేజీలో చదువుకొనే రోజుల్లోనే జూడోలోకి అడుగుపెట్టింది. ఆపై పటియాలాలోని ‘జాతీయ స్పోర్ట్స్‌ అకాడమీ’లో ఈ క్రీడలో మెరుగైన శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో పలు జూడో పోటీల్లో పాల్గొని సత్తా చాటిన ఆమెకు 2009లో పంజాబ్‌ పోలీస్‌ శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగమొచ్చింది. ఆపై పంజాబ్‌ పోలీస్‌ శాఖకు చెందిన మహిళల జూడో జట్టు తరఫున పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. 2014లో గ్లాస్గోలో జరిగిన ‘కామన్వెల్త్‌ గేమ్స్‌’లో కాంస్య పతకం సాధించిన రజ్విందర్‌.. ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన ‘జాతీయ స్థాయి క్రీడల్లో’ రజతం గెలుచుకుంది. అయితే కెరీర్‌లో దూకుడు మీదున్న సమయంలోనే తీవ్ర గాయాల పాలైంది రజ్విందర్‌. రెండు మోకాళ్లకు లిగమెంట్ గాయాలవడంతో ఐదు సంవత్సరాల పాటు ఆటకు దూరమైంది. వీటి నుంచి కోలుకోవడానికి ఆపరేషన్‌ తప్పనిసరి అని వైద్యులు చెప్పడంతో 2022లో రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ తర్వాత రెండేళ్ల పాటు ఫిజియోథెరపీ తీసుకొని, కఠినమైన వ్యాయామాలు చేసి తిరిగి ఫిట్‌నెస్‌ సాధించింది. అలా రెట్టింపు ఉత్సాహంతో 2024లో తిరిగి రింగ్‌లోకి అడుగుపెట్టింది రజ్విందర్. గాయాల నుంచి కోలుకొని ఆటలోకి రీఎంట్రీ ఇచ్చిన రజ్విందర్‌.. గతేడాది అమెరికాలో జరిగిన ‘వరల్డ్‌ పోలీస్‌ అండ్‌ ఫైర్‌ గేమ్స్‌’లో బంగారు పతకం గెలుచుకొని తన సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. ఇక తాజాగా మరో ఘనత సాధించిందామె. ‘భారత మహిళా జూడో జట్టు’కు కోచ్‌గా నియమితురాలైంది. ఆమె నేతృత్వంలోనే భారత జట్టు త్వరలో జరగబోయే ‘ప్రపంచ జూడో ఛాంపియన్‌షిప్స్‌’, ‘ఆసియా క్రీడల్లో’ పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ‘గాయాల నుంచి కోలుకొని ఆటలోకి పునరాగమనం చేయడం ఒకెత్తయితే.. భారత మహిళా జూడో జట్టు కోచ్‌గా ఎంపికవడం మరింత సంతోషంగా ఉంది. కోచ్‌గా జట్టులోని ప్లేయర్లందరికీ ఉత్తమ శిక్షణ ఇవ్వడమే నా లక్ష్యం..’ అంటోన్న రజ్విందర్‌.. ప్రస్తుతం 42 ఏళ్ల వయసులోనూ ఆటలో సత్తా చాటుతోంది. కోచ్‌గా కొత్త బాధ్యతలందుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం పంజాబ్‌ పోలీస్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోందీ జూడో క్రీడాకారిణి. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. తన కెరీర్‌ విజయాలతో పాటు తన ఫిట్‌నెస్‌ వీడియోల్నీ ఇన్‌స్టాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపుతోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings





