
Rain : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ (సోమవారం) సాయంత్రం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతోపాటు ఒకటి రెండు సార్లు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గతం వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.



