
పిగ్మెంటేషన్ తగ్గించడానికి, చర్మం కాస్త బ్రైట్‌గా కనిపించేందుకు నిమ్మరసం, బేకింగ్ సోడాను కలిపి రాసే చిట్కాలు ఆన్లైన్లో కనిపిస్తాయి. కానీ ఈ రెండింటి స్వభావం వేర్వేరుగా ఉండటంతో కలిపి చర్మంపై రాస్తే మంట, చురచుర, ఎర్రదనం, పొడిబారడం, చర్మం పొరలు ఊడటం వంటి సమస్యలు రావచ్చని JID అధ్యయనం పేర్కొంది. చర్మాన్ని ఎక్కువగా రుద్దడం, బలమైన పదార్థాలు ఉపయోగించడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొటిమలు, నల్లటి మచ్చలపై టూత్‌పేస్ట్ రాయడం పాత చిట్కాల్లో ఒకటి. దీనికి నిమ్మరసం కూడా కలిపితే మరింత త్వరగా రిజల్ట్ ఫలితం వస్తుందని కొందరు అనుకుంటారు. కానీ టూత్‌పేస్ట్‌లో ఉండే కొన్ని పదార్థాలు పళ్ల కోసం తయారు చేసినవే కానీ ముఖ చర్మం కోసం కాదని MSM అధ్యయనం పేర్కొంది. నిమ్మరసం కలపడం వల్ల చర్మంపై చికాకు వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా కనిపించేందుకు ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసాన్ని కలిపి టోనర్‌లా ఉపయోగించే DIY చిట్కాలు కూడా ప్రచారంలో ఉంది. కానీ రెండూ ఎసిడిక్ స్వభావం ఉన్న పదార్థాలే. చర్మానికి సహజంగా ఒక నిర్దిష్ట ఎసిడిక్ స్థాయి ఉంటుంది. అందుకే ఇంట్లో దొరికే ఎసిడిక్ పదార్థాలను కలిపి ముఖానికి రాయడం వల్ల చర్మం సహజ రక్షణ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. బ్లాక్‌హెడ్స్ తొలగించడానికి , ముఖాన్ని బాగా శుభ్రం చేయడానికి, చర్మాన్ని తెల్లగా చేసేందుకు ఈ కాంబినేషన్‌ను ఉపయోగించమని కొన్ని సోషల్ మీడియా పోస్టులు చెబుతుంటాయి. కానీ ఎక్కువగా స్క్రబ్ చేయడం వల్ల రంధ్రాలు నిజంగా శుభ్రం అవుతాయని కాదు. బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ కాంబినేషన్ చర్మాన్ని చాలా హార్ష్‌గా మారుస్తుంది. దీంతో చర్మం బిగుతుగా అనిపించడం, పొడిబారడం, ఎర్రబడటం, పొరలు ఊడటం, ఎర్రటి దద్దుర్లు ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. సోషల్ మీడియాలో కనిపించే స్కిన్‌కేర్ చిట్కాలను చూసి వెంటనే ప్రయత్నించకుండా ముందుగా అవి చర్మానికి సురక్షితమా కాదా అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా యాసిడ్లు, బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ వంటి ఇంటి పదార్థాలను కలిపి ముఖంపై రాయడం మంచిది కాదు. మొటిమలు, పిగ్మెంటేషన్, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలకు మీ చర్మానికి సరిపోయే స్కిన్‌కేర్ ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది. సమస్య ఎక్కువగా ఉంటే డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవచ్చు. ముఖ్య . కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.