
22ఏతో ప్రభుత్వం వేధిస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారని, అది నిజం కాదని, తమ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఆరోపణలు నిజం కాదని చెప్పేందుకే 22ఏ అంశంపై చర్చ చేపట్టామన్నారు. అయితే ప్రధాన సమస్యలపై చర్చ నుంచి తప్పించుకునేందుకే విపక్షం ప్రయత్నిస్తుందన్నారు. చర్చ జరిగితే 22ఏ విషయంలో బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవకతవకలు బయటపడతాయని భావించి పక్కదోవ పట్టిస్తున్నారన్నారు.