
రూ.2 వేలు దాటిన లావాదేవీలపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా.. మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును ఖరారు చేసింది. కేవలం వ్యాపారులకు చెల్లించే మొత్తంపై 0.4 శాతం మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును విధించనుంది. అత్యధికంగా ఒక్కో లావాదేవీకి రూ.300 మేర వసూలు చేయనున్నారు. అక్టోబర్‌ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రైల్వే, టెలికమ్‌ సర్వీస్‌, ఇన్సూరెన్స్‌, ఫ్యూయల్‌ తదితర లావాదేవీలకు రూ.5 ఛార్జ్‌ చేయనున్నారు.