
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు వీసా పరిమితులను అమెరికా ఫెడరల్‌ కోర్టు బ్లాక్‌ చేసింది. ఇటీవల హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ప్రకటించిన నిబంధనలు అమల్లోకి రావడానికి ఒకరోజు ముందే బోస్టన్‌లో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో విదేశీ విద్యార్థులు వారి చదువు పూర్తయ్యేవరకు అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. కాని కొత్త నిబంధనల వల్ల అక్కడ కేవలం నాలుగేళ్లు మాత్రం ఉండేలా ట్రంప్‌ ప్రభుత్వం మార్పు చేసింది. జర్నలిస్టులకు ఉన్న కాలపరిమితిని కుదించింది.