
వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీంతోపాటు ఒడిశా- పశ్చిమబెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లోనూ చెదురు మదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.




