
దూరంగా కనిపిస్తున్న రైలు దగ్గరకు రావడానికి ఎక్కువ సమయం ఉందని పట్టాలు దాటడం చాలా ప్రమాదకరం. సికింద్రాబాద్‌ జీఆర్పీ పరిధిలోనే వివిధ కారణాలతో ఏటా 1,300 మంది పట్టాలపై మరణిస్తున్నారు. స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంపైకి వెళ్లేందుకు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలనే వాడాలి. రైలు కోసం చూస్తున్నప్పుడు ప్లాట్‌ఫాం అంచుకు దూరంగా నిలబడాలి. స్టేషన్లలో రద్దీ ఎక్కువున్నప్పుడు మొబైల్‌లో మాట్లాడుతూ నడవొద్దు. కదులుతున్న రైలెక్కడం, పూర్తిగా ఆగకముందే దిగడం చేయొద్దు. 👉 మరిన్ని వివరాలు
Tags:#zwnj zwnj
Found this helpful?
Share this story with your network