
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్‌ నుంచి భారతదేశానికి దిగుమతులపై నిషేధం ఉంది. అయినా 362 మెట్రిక్‌ టన్నుల ఎండు ఖర్జూరాలు దిగుమతి అవుతుండడంతో సమాచారం అందుకొన్న డీఆర్‌ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు 'ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్' పేరుతో నిర్వహించిన తనిఖీల్లో వాటిని స్వాధీనం చేసుకొన్నారు. నాసిక్‌లోని సీఎఫ్‌ఎస్ అంబాడ్‌లో ముంబయికి చెందిన ఓ సంస్థ దిగుమతి చేసుకున్న 13 కంటైనర్లలోని ఎండు ఖర్జూరాలను పట్టుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి తీసుకొస్తున్న విషయాన్ని దాచిపెట్టి తరలిస్తున్నారు.





