
తమ వద్దనున్న ఆయుధాలను ప్రపంచానికి చూపేందుకు ఉత్తరకొరియా పలు ప్రయోగాలను చేపట్టింది. ఇందులోభాగంగా క్షిపణులు, ఆర్టిల్లరీ, డ్రోన్లతో భారీ లైవ్‌-ఫైర్‌ డ్రిల్‌ను నిర్వహించింది. అనంతరం తామే ఈ డ్రిల్స్‌ నిర్వహించామని ఉత్తరకొరియా ప్రకటించింది. కాగా, ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణులు తూర్పు సముద్రజలాల వైపు 250 కిలోమీటర్ల మేర ప్రయాణించినట్లు దక్షిణకొరియా వెల్లడించింది.





