
భారత మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించినా పాకిస్థాన్‌కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతులమీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు ముందుకురాలేదు. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు, శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో ఎనిమిదో ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. నక్వీ చేతులమీదుగా ట్రోఫీని తీసుకోకూడదనేది బీసీసీఐ నిర్ణయం. దీనిపై తామేమీ చెప్పలేమని భారత ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ అన్నారు.





