
ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం సాధించే అవకాశమొచ్చింది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఏటా నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ పరీక్ష ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో చూపే ప్రతిభతో నియామకాలుంటాయి. ఎంపికైన పోస్టు ప్రకారం లోయర్‌ డివిజన్‌ క్లర్కు (ఎల్‌డీసీ)/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఏ)/ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈవో) హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. ఆకర్షణీయ వేతనం, మంచి భవిష్యత్తునూ సొంతం చేసుకోవచ్చు. వివరాలు ..




