
విశాఖపట్నంలోని సెంట్రల్ పార్కు వద్ద లభ్యమైన కరెన్సీ నోట్ల (Currency Notes) మిస్టరీ వీడింది. బుధవారం ఉదయం పార్కు ఎదురుగా పెద్ద మొత్తంలో చినిగిపోయిన కరెన్సీ నోట్లు కుప్పగా పడి ఉండటాన్ని వాకర్స్ గుర్తించారు. వారి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ నోట్ల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కేజీహెచ్ ప్రాంతంలోని తాడివీధికి చెందిన ఆదిమూలం సూర్యారావు ఈ నోట్లను పడేసినట్టు అధికారులు గుర్తించారు. దుకాణాలకు కిరాణా సరకులు సరఫరా చేసే సూర్యారావు ఇంట్లో ఓ అట్ట పెట్టెలో డబ్బులు, ఎల్‌ఐసీ రశీదులు దాచి పెట్టాడు. వాటికి చెదలు పట్టడంతో పనికిరావని భావించి పార్క్‌ వద్ద పడేసినట్టు పోలీసులు గుర్తించారు. సీఐ అప్పలనాయుడు ఆ నోట్లతో పాటు ఎల్‌ఐసీ రశీదులు, పాన్‌ కార్డును సూర్యారావుకు అందజేశారు. ఈ వార్త చదివారా: వివేకా హత్య కేసు నిందితులకు చుక్కెదురు