
Paytm Stock Price Target: కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 2 వేలకు మించిన యూపీఐ మర్చంట్ ట్రాన్సాక్షన్లపై ఎండీఆర్ అమలుతో పేమెంట్ సంస్థలకు కొత్త ఆదాయ అవకాశాలు ఏర్పడుతున్నాయని పలు బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే పేటీఎం, పైన్ ల్యాబ్స్ వంటి స్టాక్స్ పుంజుకుంటాయని పేర్కొన్నాయి. అదనపు ఆదాయం సమకూరనుండగా సమీప భవిష్యత్తులో 15 నుంచి 35 శాతం వరకు పెరగొచ్చని అభిప్రాయపడుతున్నాయి.