
సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట మండలంలోని కుసుమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడు బలగ గణేష్‌ ఫాస్టెస్ట్‌ పారా స్విమ్మర్‌(అత్యంత వేగవంతమైన పారా ఈతగాడు)గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం డొంకలపర్తికి చెందిన గణేష్‌ స్పోర్ట్స్‌ కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగం పొందారు. ఆటపై తనకున్న మక్కువతో అనేక సరస్సుల్లో స్విమ్మింగ్‌ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈనెల 12న వెట్‌ సూట్‌ లేకుండా 5.14 గంటల్లో జర్మనీ నుంచి స్విట్జర్లాండ్‌కు లేక్‌ బోడెన్సీ సరస్సు (ఐరోపాలో మూడో పొడవైన సరస్సు)లో 12 కి.మీలు ఈది రికార్డ్‌ సృష్టించారు. ఓపెన్‌ వాటర్‌ మారథాన్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో బోడెన్సీ క్వెరింగ్‌ ద్వారా నీటి ఉష్ణోగ్రత 16.5 డిగ్రీలు ఉండే ఈ సరస్సులో పోటీలు జరిగినట్లు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.