
పర్వతాలు, ఎత్తైన ప్రాంతాల్లో సరకులతో పాటు మనుషుల రవాణాకు గాడిదలను వినియోగిస్తారు. అయితే, గాడిద మాంసానికి చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంది. దీనిని అక్కడ విలాసవంతమైన ఆహారంగా భావిస్తారు. దీనిని పాకిస్థాన్ తనకు అనుకూలమైన వ్యాపారంగా మార్చుకుంటోంది. బలూచిస్థాన్‌లోని పొడి నెలల్లో గాడిదల పెంపకం చేపట్టి, వాటి మాంసాన్ని చైనాకు సరఫరా చేస్తోంది. అలాగే, వాటి చర్మాన్ని ఉడకబెట్టడం ద్వారా వచ్చె కొల్లాజెన్‌ను కొన్ని రకాల ఔషధాల్లో ఉపయోగిస్తారు. దీంతో వాటికి గిరాకీ ఎక్కువగా ఉంది.





