
ఇంటర్నెట్‌ డెస్క్: ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పాత సామగ్రి, వ్యర్థాల (Scrap) విక్రయం ద్వారా గత ఐదేళ్లలో రూ.5,100 కోట్లకుపైగా ఆదాయం సమకూరినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో పేరుకుపోయిన దస్త్రాలు, ఇతర పాత సామగ్రిని తొలగించేందుకు ఏటా ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 2021 నుంచి ఇప్పటివరకు ఐదు ప్రత్యేక క్యాంపెయిన్‌లు, నెలవారీ సంస్కరణల ద్వారా 24.20 లక్షలకు పైగా ఆఫీసులను కవర్‌ చేసి, 1.80 కోట్లకుపైగా ఫైళ్లను తొలగించినట్లు సిబ్బంది వ్యవహారాలశాఖ తెలిపింది. స్క్రాప్ విక్రయం ద్వారా రూ.5,102.91 కోట్ల ఆదాయం లభించింది. ఒక్క ‘క్యాంపెయిన్‌-5’లోనే 11.6 లక్షల ఆఫీసుల్లో.. 29.52 లక్షల దస్త్రాలను తొలగించారు. దీంతో 233.75 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ అయ్యింది. వ్యర్థాలు, పాత వస్తువుల విక్రయం ద్వారా సుమారు రూ.833.92 కోట్ల ఆదాయం సమకూరింది. తాలిబన్ల అదుపులో కేరళం వ్లాగర్‌.. ఆపై విడుదల ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31 వరకు ‘క్యాంపెయిన్- 6’ నిర్వహించనున్నారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వాటి ఆఫీసులతోపాటు విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల్లోనూ దీన్ని అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమ పురోగతిని సమీక్షించేందుకు సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం ఓ ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.