
ఇందుకూరుపేట: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 100 శాతం స్ట్రైక్‌రేట్‌ సాధించాలని ఆకాంక్షిస్తూ ఇందుకూరుపేట భాజపా మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులు రెడ్డి ఆదివారం శ్రీచాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉచిత విద్యుత్, నూతన పింఛన్ల మంజూరుతోపాటు కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారుబోయిన శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దువ్వూరు శ్రీనివాసులు, మండల ఇన్‌ఛార్జి ఆలూరు నాగవేణి పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
