
ముఖంపై అవాంఛిత రోమాలు (ఫేషియల్ హెయిర్) తొలగించేందుకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. దీనికోసం శనగ పిండిలో కొద్దిగా పసుపు, పెరుగు కలిపి పేస్ట్ చేయండి. దీనిని అవాంఛిత రోమాలు ఉన్నచోట రాసి ఆరిన తర్వాత వ్యతిరేక దిశలో స్క్రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు ఈజీగా పోతాయి. మార్కెట్లో లభించే కార్న్ స్టార్చ్‌లో కోడిగుడ్డు తెల్లసొన, కొద్దిగా చక్కెర కలిపి పేస్ట్ చేయండి. దీనిని అవాంఛిత రోమాలు ఉన్నచోట రాసి ఆరబెట్టండి. తర్వాత మాస్క్ తీసేస్తే అవాంఛిత రోమాలు తగ్గుతాయి. చక్కెరలో కొద్దిగా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్ట్ చేయండి. ఇది కొద్దిగా అంటుకునేలా ఉండాలి. దీనిని అవాంఛిత రోమాలు ఉన్నచోట రాసి హెయిర్ గ్రోత్ వ్యతిరేక దిశలో స్క్రబ్ చేయండి. దీనివల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. ముఖంపై అవాంఛిత రోమాలు తొలగించడంలో ఈ నూనెలు సహాయపడతాయి. దీనికోసం కొబ్బరి నూనెలో కొద్దిగా లావెండర్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత క్లీన్ చేసుకుంటే మంచిది. తేనె చర్మానికి అంటుకున్నట్లుగా ఉండి అవాంఛిత రోమాలు తొలగించడంలో సహాయపడుతుంది. దీనికోసం తేనెలో నిమ్మరసం కలిపి అవాంఛిత రోమాలు ఉన్నచోట రాయండి. ఆరిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. ఓట్స్, అరటి పండును బ్లెండ్ చేసి ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత తీసేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ కుదుళ్లను బలహీనపర్చి అవాంఛిత రోమాలు తొలగించడంలో సహాయపడుతుంది. దీనికోసం పచ్చి బొప్పాయిని గుజ్జులాగా చేసి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచిది. అవాంఛిత రోమాలు పోగొట్టేందుకు ఈ సింపుల్ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఫేషియల్ హెయిర్ సమస్యతో బాధపడే వారు ఈ స్పియర్‌మెంట్ టీ రెగ్యులర్‌గా తాగితే చాలా మంచిది. హార్మోన్ బ్యాలెన్స్ గాడితప్పడం వల్ల అవాంఛిత రోమాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే హార్మోన్ బ్యాలెన్స్ బాగుండేందుకు ఒత్తిడి లేకుండా చూసుకోండి. రోజూ 8 గంటలు నిద్రోపోవాలి. అలాగే రోజూ కాసేపు వ్యాయామం చేయండి. పోషకాహారం తీసుకోండి. జంక్ ఫుడ్ దూరం పెట్టండి.




