
Bigg Boss 10 Telugu Nominations Live: ఏం ఫీల్ ఉంది మావా అంటూ నవీన్ పోలిశెట్టి మీమ్ ఒకటి వైరల్ అవుతుంటుంది కదా.. ఇదిగో బిగ్ బాస్ హౌస్లో ఈ గయ్యాళి గంపల ఫైట్ చూస్తుంటే.. అలాగే అనిపిస్తుంటుంది. వర్షిణి, షాలిని తిట్టుకోవడం కాదు.. అక్కడ బిగ్ బాస్ కెమెరా అటు తిప్పితే జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకోవడానికి సిద్ధం అయిపోయారు. మధ్యలో సృష్టి వచ్చి ఆపింది కానీ.. లేదంటే బిగ్ బాస్ హౌస్లో ఈ భామల పోరు రక్తపాతానికి దారితీసేదేమో అన్నట్టుగానే ఇద్దరూ రెచ్చిపోయారు. మరి అసలు ఎపిసోడ్లో ఈ గొడవను ఎంత వరకూ చూపిస్తారో ఏమో కానీ.. లైవ్ ఎపిసోడ్లో మాత్రం రచ్చ మామూలుగా అవ్వలేదు.