
హైదరాబాద్ : ప్రజా సమస్యలు శాసన సభా సమావేశాల్లో ప్రస్తావనకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ ( MLC Ramana) ఆరోపించారు. ప్రభుత్వ హామీలను ( Government Promises ) నిలబెట్టుకోలేని అసమర్థ పాలన ( Incompetent administration ) బయటకు వస్తుందన్న ఉద్దేశ్యంతో సభలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సి ఉండగా అధికార పక్షం ప్రతిపక్షాలను రెచ్చగొట్టిందని విమర్శించారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నప్పటికీ, శాసన మండలిలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నించామని ఆయన తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన పదిశాతం పనిని పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించామని వెల్లడించారు. విద్యా, వ్యవసాయం, విద్యుత్, ఫీజ్ రీయింబర్స్మెంట్, చేనత కార్మికుల సమస్యలపై ఎండగట్టామని వివరించారు. రేవంత్రెడ్డి చేయించుకున్న సర్వేకు భిన్నంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిస్థితులున్నాయని స్పష్టం చేశారు.






