
ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలను కోనసీమగా మార్చగల నాయకుడు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అపర భగీరథుడు సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే మాధవి కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నూరుశాతం పూర్తిచేసి జిల్లాలోనే తొలిస్థానంలో నిలిపిన టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు ఆమె వెలిగొండ, శ్రీశైలం పర్యటన చేపట్టారు.





