
‘ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌’లో అంగన్‌వాడీ కేంద్రాల వివరాల నమోదు యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్న ఉపాధ్యాయురాలు న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్, కొడంగల్‌ టౌన్‌: చిన్నారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార పంపిణీ ఇందులో భాగమే. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చవుతున్నా ఇప్పటికీ పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారులు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ వ్యవస్థ మరింత బలోపేతమయ్యేలా న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం(ఎన్‌హెచ్‌టీఎస్‌) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాలో కలిపి 19 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల ద్వారా 4,857 అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ కొనసాగుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన మూడేళ్లు దాటిన చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. మహిళల్లో రక్తహీనత నివారణకు ఒక పూట సంపూర్ణ భోజనం అందించే పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రతి నెలా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో చిన్నారుల వయసుకు తగిన ఎత్తు, బరువును నిర్వాహకులు నమోదు చేస్తారు. ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌తో పర్యవేక్షణ సులభతరంగా మారింది. సేవల మెరుగుకు మార్గం సుగమమైంది. ఎక్కడైనా అంగన్‌వాడీ ఉపాధ్యాయులు గైర్హాజరైతే సూపర్‌వైజర్లు, సీడీపీవోలు గుర్తించి తగు చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమం ద్వారా పోషణలోప నివారణ దిశగా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. లలిత కుమారి, జిల్లా సంక్షేమాధికారిణి, సంగారెడ్డి .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



