
అమరావతి: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితిని పెంచింది. ఈ మేరకు రెండు వేర్వేరు జీవోలు విడుదల చేసింది. యూనిఫాం సర్వీసులకు రెండేళ్ల పాటు సాధారణ కేటగిరీలో వయోపరిమితిని పెంచింది. మిగిలిన నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రిజర్వుడు కేటగిరీలకు సడలింపులు యథాతథంగా వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఏచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు ఈ పెంపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.