
రాజ్మా, టొమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, కారం, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు తగినంత, నూనె కావాల్సినంత రాజ్మాను ముందుగా శుభ్రంగా కడిగి రాత్రంతా బాగా నానబెట్టండి. ఉదయం నీళ్లు వంపి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోండి. నూనె వేడి అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రంగు మారే వరకు వేయించండి. తర్వాత ఇందులో పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి కూడా వేసి వేయించుకోండి ఇందులో టొమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోండి. తర్వాత ముందుగా ఉడికించుకున్న రాజ్మా మసాలాను నీళ్లతో సహా వేసి కలపండి. 10 నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి ఇందులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే.. రుచికరమైన రాజ్మా మసాలా రెడీ అయినట్లే. వేడిగా తింటే రుచి బాగుంటుంది.




