
ఊట్కూరు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వినాయక ఉత్సవాలు, నిమజ్జనం రోజున నిర్వహించే శోభాయాత్ర సమయాల్లో డీజేల వినియోగంపై నిషేధం ఉందని, దీనికి అందరూ సహకరించాలని ఊట్కూరు ఎస్సై రమేశ్‌ కోరారు. బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ.. మండపాల కమిటీ సభ్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని, గణేశ్‌ ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు పెట్టినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్సవ నిర్వాహకులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.