
రోగులకు అందుబాటులో 16 రోజుకు రూ.1000 వసూలు అద్దెకు ఇచ్చే గదులను పరిశీలిస్తున్న సూపరింటెండెంట్‌ రంగా అజ్మీరా పాలమూరు, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగులకు ప్రత్యేక గదులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని రోజుకు రూ.1,000 చొప్పున బాడుగకు ఇవ్వనున్నారు. ఇందుకోసం 16 గదులను ముస్తాబు చేశారు. కలెక్టర్‌ ఖుష్బూగుప్తా ప్రత్యేక నిధులు కేటాయించి ఆసుపత్రిలో మొదటి అంతస్తులో వీటికి మరమ్మతులు చేయించారు. అందులో రెండు గదులను వైద్యుల కోసం కేటాయించారు. మరో 14 రోగులకు ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. వీటితో రోగులకు ప్రత్యేక వసతులు అందుబాటులో వచ్చాయి. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వైద్యసేవల కోసం ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వందలాది మంది రోగులు వస్తుంటారు. కొందరు జనరల్‌ వార్డుల్లో కాకుండా తమకు ప్రత్యేక గదిని కేటాయించాలని, అందుకు రుసుము చెల్లిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మాతాశిశు విభాగంలో ఇప్పటికే ఆరు గదులు ప్రత్యేకంగా రూపొందించి అద్దెకు ఇస్తున్నారు. వీటిని కాన్పులైన వారికి ఆరు నెలల నుంచి కేటాయిస్తున్నారు. వారి నుంచి రూ.1,000 చొప్పున అద్దె తీసుకుంటున్నారు. ప్రస్తుతం 16 ప్రత్యేక గదులు అందుబాటులోకి రావడంతో సాధారణ వ్యాధులు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు, ఆర్థో సేవల కోసం వచ్చిన వారికి కేటాయించనున్నారు. విన్నపాల మేరకు.. - డా.రంగా అజ్మీరా, ఎంజీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మా ఆసుపత్రికి వచ్చిన రోగులకు మంచి వసతులు అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రోజూ అన్ని వార్డులను పర్యవేక్షిస్తున్నాం. రోగుల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా కలెక్టర్‌ అనుమతితో ఈ ప్రత్యేక వార్డులు అందుబాటులోకి తెచ్చాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





