
గట్టు : మండల పరిధిలో సుమారు రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమిపూజ చేశారు. లింగాపురంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న వ్యవసాయ గోదాం, రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మల్లంపల్లిలో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం, మరో రూ.10 లక్షలతో ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంట ఉత్పత్తుల నిల్వకు గోదాం, మహిళల సమావేశాలకు సమాఖ్య భవనాలు ఎంతో దోహదపడతాయన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు అనవసర పెట్టుబడులు పెట్టకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులకు తగ్గట్లు పంటలు వేసుకోవాలని, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





