
ఆసుపత్రుల్లో జరుగుతోన్న నిలువు దోపిడీపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. మార్కెట్లో రూ.11లకు లభించే ఓ ఐవీ క్యానెల్ సెట్‌ను.. ఏకంగా 2,800 శాతం లాభానికి అమ్ముతున్నట్టు సర్వేలో తేలింది. అలాగే, సిరంజీలు, మాస్క్‌లు సహా వైద్య సామాగ్రి పేరుతో రోగులను దోచేస్తున్నారని తేలింది. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారం ముండే లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది.