
వాయిస్ కంట్రోల్ ఫీచర్లు ఎలా పనిచేస్తాయనే దానిపై ఎల్జీ క్లారిటీ ఇచ్చింది. రిమోట్లోని వాయిస్ లేదా ఏఐ బటన్ నొక్కినప్పుడు మాత్రమే మనం చెప్పేది టెక్స్ట్గా మారుతుందనీ క్లారిటీ ఇచ్చింది. మనం టీవీతో మాట్లాడటానికి వాడే ‘వేక్-వర్డ్’ (ఉదాహరణకు ‘హాయ్ ఎల్జీ’ లాంటివి) సరిగ్గా వినిపించిందా లేదా అని చెక్ చేసే ప్రాసెస్ అంతా ఆ టీవీలోనే జరుగుతుందనీ చెప్పుకొచ్చింది. వేక్-వర్డ్ గనుక తగలకపోతే.. ఆ ఆడియో ఎక్కడా రికార్డు కాదనీ టెక్స్ట్గా మారదనీ అలాగే వేరే సర్వర్లకు ట్రాన్స్ మిట్ కాదని ఎల్జీ స్పష్టం చేసింది. టెక్నాజీ పూర్తి సేఫ్ అనీ, తమ స్మార్ట్ టీవీలు ఎవరి మాటలను రహస్యంగా రికార్డు చేయడం లేదని కంపెనీ తేల్చిచెప్పింది.




