
కర్నూలు వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల కొరత న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం: కర్నూలు వైద్య కళాశాలలో కీలక విభాగాల్లో ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్డియాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్, న్యూరోసర్జరీ, కంటి విభాగం, గైనిక్, ఈఎన్‌టీ, డెర్మటాలజీ విభాగాల్లో సరిపడా ప్రొఫెసర్లు లేవు. మరికొన్ని విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్నారు. ప్రధానంగా సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లోని కీలక విభాగాల్లో అసోసియేట్‌ ప్రొఫెసర్లను ఇన్‌ఛార్జులుగా పెట్టి డీఎం, పీజీ సీట్లు కాపాడుకొంటున్నారు తప్ప నాణ్యమైన వైద్యులను తయారు చేయడంపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చికిత్సలు చేస్తూ ప్రత్యక్షంగా పాఠాలు చెప్పే నిపుణులైన ప్రొఫెసర్లు ఒక్కొక్కరే ఉద్యోగ విరమణ చేస్తుండటంతో బోధనతోపాటు వైద్య సేవలు సైతం మొక్కుబడిగా మారుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కేఎంసీ ప్రతిష్ట మసకబారే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీలక విభాగాల్లో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ చేశారు. దీంతో న్యూరోసర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తాల్మిక్, పీడియాట్రిక్, గైనిక్, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి విభాగాల్లో పీజీ, డీఎం విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడం లేదు. సీనియర్‌ ప్రొఫెసర్ల కొరత కారణంగా జూనియర్లకు పదోన్నతులు ఇచ్చారు. తక్కువ అనుభవం ఉన్నవారిని ఇన్‌ఛార్జి ప్రొఫెసర్లుగా నియమించారు. దీంతో పీజీలకు పాఠాలు చెప్పేవారు కరవయ్యారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పాఠాలు వింటూ చదవుకోవాల్సి వస్తోందని చాలామంది యూజీ, పీజీ విద్యార్థులు చెబుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.