
KTR | రేవంత్ రెడ్డికి(Revanth) దళితులు మీద ఎక్కడలేని కురిపిస్తున్నాడు. ఒక దశలో అయితే ఎమోషనల్ అయిపోయి ప్రసాద్ గారినో, భట్టి గారినో శాసన సభలో ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడని అనుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మీడియా సమావేశంలో మాట్లాడారు.నిజంగా నీకు దళితులపై(Dliths) అంత ప్రేమ ఉంటే దళిత డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. కేసీఆర్ దళిత బంధు రూ.10 లక్షలు ఇస్తాను అంటే రూ.12 లక్షలు ఇస్తానని కోతలు కోసావు. ఇప్పుడు అమలు చేయాలని సవాల్ విసిరారు. దళితుల మీద ప్రేమ ఉంటే ఎస్సీ డిక్లరేషన్, గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఎస్టీ డిక్లరేషన్ చేయడానికి నిన్ను ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు. ఇలాంటివి ఏమీ చేయకుండా నోటికి వచ్చినట్లు శిఖర సమానుడైన కేసీఆర్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాప్ అయిన సినిమాకు శతజయంతి వేడుకలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. దళితుల మీద ఎక్కడ లేని ప్రేమ రేవంత్ రెడ్డి కురిపిస్తున్నాడు ఒక దశలో అయితే ఎమోషనల్ అయిపోయి ప్రసాద్ గారినో, భట్టి గారినో ముఖ్యమంత్రి చేస్తాడని అనుకున్నాను అంత ప్రేమ ఉంటే దళిత డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయండి కేసీఆర్ దళిత బంధు రూ.10 లక్షలు ఇస్తాను అంటే రూ.12 లక్షలు… pic.twitter.com/1cTkezegPI — Telugu Scribe (@TeluguScribe) September 17, 2026





